Site icon NTV Telugu

AP Chandrababu: ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Cm Chandrababu Ficci

Cm Chandrababu Ficci

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి కర్నూల్ బయలుదేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు రోజుల పాటు వరుస భేటీలతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌లను చంద్రబాబు కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం, రంగాల వారీగా పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రులకు విజ్ఞాపనలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశాలకు సంబంధించి జనశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సీసీఐ సదస్సులో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించారు.

Also Read: YCP: వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలు ఔట్!

ఇక నేడు సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. నందికొట్కూరు మం మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీరు సీఎం విడుదల చేయనున్నారు. సీఎం ఈరోజు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు అల్లూరుకు చేరుకొనున్నారు. 1 గంటకు మల్యాల ఎత్తిపోతలను సందర్శించి హంద్రీనీవాకు నీరు విడుదల చేస్తారు. హంద్రీనీవా కాలువలో కృష్ణా జలాలకు జల హారతి ఇవ్వనున్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మల్యాల వద్ద రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.

Exit mobile version