NTV Telugu Site icon

CM Chandrababu: భిన్నత్వాన్ని చూపించేలా ఏపీ సీఎం ప్లాన్‌.. 10 నుంచి 6 వరకు సచివాలయంలోనే..!

Cm Babu

Cm Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఓవైపు కేబినెట్‌ మంత్రులకు శాఖలు కేటాయించారు.. మరోవైపు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అయితే, గత పాలనకు.. ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మినహాయిస్తే.. ఇక నుంచి ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారట సీఎం చంద్రబాబు. సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇక, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాకే తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉందంటున్నారు.. ఇక, రెగ్యులర్‌గా సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారంట.. అంతే కాదు.. పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Read Also: DRDO Recruitment 2024: ఎటువంటి రాత పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?