NTV Telugu Site icon

CM Chandrababu: ఉచిత ఇసుక విధానం మ‌రింత పార‌ద‌ర్శకంగా అమ‌లు చేయాలి..

Chandrababu

Chandrababu

CM Chandrababu: పంచ గ్రామాల స‌మ‌స్యకు టైం బాండ్ పెట్టుకొని ప‌రిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరిత‌గ‌తిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా క‌లెక్టరేట్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స‌మీక్ష నిర్వహించారు. న‌గ‌రంలో గుంత‌ల రోడ్లు ఉండ‌టానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారుల‌పై చ‌ర్యలు త‌ప్పవన్నారు. తాగునీటి ప్రాజెక్టుల రూప‌క‌ల్పన, పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు మార్చి నాటికి పూర్తి కావాలన్నారు. జిల్లాలోని జ‌ల‌శ‌యాల సామ‌ర్ధ్యాల‌ను గుర్తించి నీటి నిల్వ సామార్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోట‌ళ్లు మ‌రిన్ని రావాలి… అభివృద్ధి చేయాలి… గ్రే హౌండ్స్ భూముల‌ను హోట‌ళ్లకు వినియోగించుకోవ‌చ్చన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వ‌చ్చే నాటికి.. జిల్లాలోని అభివృద్ధి ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలన్నారు.

Read Also: Minister Atchannaidu: వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నాం..

శాంతిభ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ‌కు మ‌రిన్ని చ‌ర్యలు చేప‌ట్టాలి.. సీసీ కెమెరాల సంఖ్య పెంచాలి.. సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హాయంతో వాహ‌నాల వేగాన్ని నియంత్రించాలి.. ప్రమాదాల‌ను త‌గ్గించాలన్నారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానం పెర‌గాలన్నారు. సూర్యఘ‌ర్ పథ‌కంలో భాగంగా రూప్ టాప్ సోలార్ ప్లాంటులు ఏర్పాటు చేయాలి.. ప్రజ‌ల‌ను మ‌రింత ప్రోత్సహించాలన్నారు. ఆయుష్మాన్ భార‌త్, అపార్ ఆవ‌శ్యక‌త‌ను తెల‌పాలి.. ఫ‌లాలు ఎక్కువ మందికి అందేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానం మ‌రింత పార‌ద‌ర్శకంగా అమ‌లు చేయాలన్నారు. అన‌కాప‌ల్లి – అచ్యుతాపురం రోడ్డుకు త్వరిత‌గ‌తిన చ‌ర్యలు తీసుకోవాలి.. పీపీపీ విధానాన్ని అనుస‌రించాలన్నారు.

సుగ‌ర్ ఫ్యాక్టరీల ద్వారా కేవ‌లం పంచ‌దార ఉత్పత్తి మాత్రమే కాకుండా.. ఇథ‌నాల్, డిస్టిల‌రీ ఉత్పత్తిపై దృష్టి సారించాలి.. రైతులకు ప్రయోజ‌నాలు వ‌చ్చేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవ‌స్థను గాడిన పెట్టాలి… ఉపాధ్యాయులకు శిక్షణ‌.. భ‌వ‌నాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టూరిజం అభివృద్ధికి ఊతం ఇస్తూ… గిరిజ‌న యువ‌తను గైడ్లుగా మార్చాలి.. త‌గిన శిక్షణ ఇప్పించాలన్నారు. ఏజెన్సీల్లో డోలీమోత స‌మ‌స్యకు చెక్ పెట్టాలన్నారు. ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వ‌చ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవ‌హ‌రించాలన్నారు. అభివృద్ధి విష‌యంలో… ప‌రిపాల‌న వ్యవ‌హారాల్లో ప్రజాప్రతినిధులు అధికారుల‌కు పూర్తి స‌హ‌కారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

Show comments