CM Chandrababu: 2014-19 మధ్య కాలంలో అన్న క్యాంటీన్లు పెట్టాం.. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని మరింత అభివృద్ధి చేసింది.. కానీ ఏపీలో దౌర్బాగ్యం.. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. తాజాగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి.. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 70 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పటి వరకు అన్న క్యాంటీన్ల ద్వారా 5.72 కోట్ల భోజనాలు పెట్టాం.. రూ.104 కోట్ల మేర సబ్సిడీని అందించామని గుర్తు చేశారు.. ప్రతి దేవాలయంలో అన్నదానం కార్యక్రమం చేపడతామన్నారు. రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార పంపిణీ చేపడుతున్నాం… దీని కోసం రూ. 14,070 కోట్లు ఖర్చు పెడుతున్నామని గుర్తు చేశారు. రేషన్ మాఫియాను అరికడుతున్నాం.. రేషన్ డిపోలను పునః ప్రారంభించామన్నారు.
READ MORE: R Narayana Murthy : బాలకృష్ణ చెప్పింది నిజం కాదు.. ఆర్.నారాయణ మూర్తి రియాక్ట్
యూనివర్శల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ తెచ్చామని సీఎం చంద్ర బాబు తెలిపారు. ఈ తరహా పాలసీ మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని చెప్పారు. 1.63 కోట్ల మంది పేదలకు రూ. రూ. 25 లక్షల వరకు ఉచితంగా చికిత్సలు అందించేలా పాలసీ రూపొందించామన్నారు. మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా ఏడాదికి వేట విరామ సమయంలో రూ.20 వేలు అందిస్తున్నామన్నారు. మత్స్యకారులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 217 రద్దు చేశామని చెప్పారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ లు అందిస్తున్నామన్నారు. బీసీలకు సబ్సిడీ మీద, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లు అందిస్తామని తెలిపారు.