NTV Telugu Site icon

AP CID: నేడు రెండో రోజు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

Chandra Babu

Chandra Babu

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని ఇవాళ (ఆదివారం) ఏపీ సీఐడీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. తొలిరోజు నిన్న ( శనివారం ) రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ.. దాదాపు 6 గంటల పాటూ ఆయన్ని ప్రశ్నించారు. మధ్యలో 1 గంట భోజనానికి సమయం కేటాయించారు. చంద్రబాబు తరపు సమక్షంలో ఈ విచారణ జరిగింది. నిన్న చంద్రబాబు విచారణలో మొత్తం 12 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు.

Read Also: Turmeric Price Hike: నాలుగు నెలల్లో 180శాతం పెరిగిన పసుపు ధర

ఈ స్కిల్ స్కాం కేసులో మొత్తం రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందనీ సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందులో జీఎస్టీ తీసేయగా.. రూ.301 కోట్లు మనీ ఉందనీ.. 60 కోట్ల రూపాయలు నిజంగానే స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేసినా.. మిగతా రూ.241 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా 10 ప్రశ్నలను ముందు ఉంచి విచారణ వేసినట్లు తెలిసింది. అవి.. మొత్తం ఈ ప్రాజెక్టు విలువ ఎంత? ఈ ప్రాజెక్టు విలువ గుజరాత్ కంటే ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉంది? కాంట్రాక్ట్‌ను ఏ ప్రాతిపదికన ఇచ్చారు? సబ్ కాంట్రాక్టులను ఎలా ఇచ్చారు? నిధుల విడుదలపై మీరు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చారా? ఈ ఫైల్ లోని 13 సంతకాలు మీరే చేశారా? లాంటి ప్రశ్నలను సీఐడీ అధికారులు చంద్రబాబును అడిగినట్లు సమాచారం. నిన్న చంద్రబాబు చెప్పిన ఆన్సర్స్ ను బట్టి.. సీఐడీ అధికారులు కొత్త ప్రశ్నావళిని రెడీ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

ఇవాళ చంద్రబాబును సూటిగా మరిన్ని ప్రశ్నలు సీఐడీ అధికారులు అడగనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రశ్నలకు వచ్చే ఆన్సర్స్ ను బట్టి.. ఆయన్ని మరిన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలా లేదా, ఇక్కడితో విచారణ ముగించాలానేది నేటి సాయంత్రం నిర్ణయం తీసుకోనున్నారు. మరిన్ని రోజులు ప్రశ్నించాలి అనుకుంటే, మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరే అవకాశం ఉంది. దీంతో నేటి సాయంత్రానికి చంద్రబాబు నాయుడి రిమాండ్ అదనపు గడువు ముగుస్తుంది.

Read Also: Neha Sharma : ఉబికి వచ్చే అందాలను దాచలేకపోతున్న నేహా శర్మ..

దీంతో రేపు( సోమవారం) చంద్రబాబుని సీఐడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు ప్రవేశ పెడతారు. రిమాండ్ పొడిగించాలా వద్దా అనే దానిపై జడ్జి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు బెయిల్ కోసం దాఖలైన పిటిషన్లను కోర్టు రేపు ఎంక్వైరీ చేయనుంది. అలాగే చంద్రబాబుపై అమరావతి రాజధాని రింగ్ రోడ్డు స్కాం కేసు, ఫైబర్ నెట్ స్కాం కేసుల్లో సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్లపై కూడా రేపే విచారణ చేయనుంది.