NTV Telugu Site icon

CEO Mukesh Kumar: దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తాం..

Ap Ceo

Ap Ceo

కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని తెలిపారు. ఈసారి ఆన్ లైన్లో నామినేషన్ ఫారంలు ఫిలప్ చేసుకోవచ్చుని తెలిపింది. కానీ ప్రింటవుట్ తీసుకుని ఆర్వోకు ఫిజికల్ గా అందించాల్సిందేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ‘‘ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది.

Read Also: Lok Sabha Elections 2024: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి..? ఎన్నికల ముందే ఎందుకు..

అభ్యర్థులు తమ మీదున్న క్రిమినల్ కేసులను మూడు సార్లు ఫైల్ చేయాల్సి ఉంటుందని సీఈవో ముఖేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 4 లక్షల మంది ఉద్యోగులను నియమించాం.. బందోబస్తుకు.. శాంతి భద్రతల నిమిత్తం లక్ష మందికి పైగా అవసరమని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానస్పద ఖాతాలు.. లావాదేవీలు ఏమైనా ఉన్నాయోమోననే అంశం పైనా బ్యాంకులపై నిఘా పెట్టామని చెప్పారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశాం.. అనుమానస్పద లావాదేవీలపై సమాచారం ఇవ్వాలని సూచించామన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత పెంచుతాం.. హెలికాప్టర్లల్లో ప్రయాణిస్తూ ప్రచారం చేస్తారు.. అలాంటి చోట్ల కూడా నిఘా పెట్టాం.. నగదు తరలింపులు హెలికాప్టర్ల ద్వారా జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఇప్పటికే పరీక్షించాం.. ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఈవో ముఖేష్ కుమార్ వెల్లడించారు.

మరోవైపు సీఈవో ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. కోడ్ అమల్లోకి వచ్చింది.. కొత్త పనులు ప్రారంభించకూడదని తెలిపారు. సీఎం, మంత్రుల ఫొటోలు ఉంచకూడదన్నారు. మంత్రులకు ప్రొటోకాల్ ఉండదని పేర్కొన్నారు.. ప్రభుత్వం జారీ చేసే పత్రాలపై నేతల ఫొటోలు ఉండకూడదని చెప్పారు. సంక్షేమ పథకాలు కొనసాగుతాయి.. కొత్త లబ్దిదారుల ఎంపిక ఇకపై చేయకూడదన్నారు. ప్రారంభోత్సవాలు చేయకూడదు.. మతపరమైన కార్యక్రమాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.. ఓ టీమ్ లో ఒక గ్రామ సచివాలయ సిబ్బంది ఉండేలా ఈసీ అనుమతి ఇచ్చిందని తెలిపారు. టీచర్లు లేకుంటే ఎన్నికలు జరగవు.. ఇటీవల జరిగిన బదిలీల్లో కొంత మందిపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. మేం సమాచారం సేకరించాం.. ఈసీఐ దృృష్టికీ తీసుకెళ్లాం.. ఈసీఐ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ తెలిపారు.

Read Also: Chandrababu: జగన్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.. పోలింగే మిగిలింది.. చంద్రబాబు ట్వీట్