NTV Telugu Site icon

AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు..

Ap Ceo Mk Meena

Ap Ceo Mk Meena

AP CEO MK Meena: ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పోలింగ్ శాతం బాగా పెరిగిందని నమ్ముతున్నామన్నారు. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని.. ఇప్పుడే పోలింగ్ శాతం చెప్పలేమన్నారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 17A స్క్రూట్నీ తర్వాతే రీ-పోలింగ్ విషయంలో నిర్దారిస్తామన్నారు. రీ-పోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు రాలేదన్నారు. తెనాలి, నరసరావు పేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశామన్నారు. ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని.. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారన్నారు. ఈవీఎం మెషీన్లతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని.. సాంకేతిక ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయన్నారు.

Read Also: CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరుస్తాం..

వాతావరణం బాగా సహకరించిందని ఆయన వెల్లడించారు. తన దగ్గర కార్డు ఉంది కానీ.. ఓటు లేదనే ఫిర్యాదులు ఎక్కడా కన్పించ లేదన్నారు. బందోబస్తు పెద్ద ఎత్తున పెట్టామన్నారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామన్నారు. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని సీఈవో చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామన్నారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉందన్నారు. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారన్నారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామని చెప్పారు.

Read Also: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌.. క్యూలైన్‌లో ఉన్నవారికి ఛాన్స్‌

పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలు మోహరించాయన్నారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ ఘటన జరిగినా.. వెంటనే సమస్య పరిష్కరించామన్నారు. పల్నాడులో 12 ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారని.. కానీ డేటా ఎక్కడికీ పోలేదన్నారు. పోలింగ్ కొద్దిసేపు అంతరాయం కలిగింది.. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభించామని చెప్పారు. హింసాత్మక ఘటనలు జరిగినా.. మెషీన్ల డామేజ్ జరిగినా పోలింగ్ నిర్వహించగలిగామన్నారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదన్నారు. తెనాలి, అనంతపురంలలో లీడర్లను హౌస్ అరెస్ట్ చేశామని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.