NTV Telugu Site icon

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో కీలక అంశాలు!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ సచివాలయంలో రేపు(అక్టోబర్ 16) ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలిసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించనుంది.

Read Also: AP Weather: ఏపీకి ముంచుకొస్తున్న ముప్పు.. రాయలసీమ, దక్షిణ కోస్తాకు హైఅలర్ట్

రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకంపై చర్చించనున్నట్లు తెలిసింది.

Show comments