Site icon NTV Telugu

AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!

Nara Lokesh

Nara Lokesh

నేడు ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయిన విషయం తెలిసిందే. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.

Also Read: Veeraiah Chowdary: పోలీస్ కస్టడీకి వీరయ్య చౌదరి హత్య కేసు నిందితులు!

మరోవైపు ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన‌ 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెల‌ప‌నుంది. విశాఖలో కాగ్నిజెంట్ ఏర్పాటుకు సంబంధించి చర్చించనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అమ‌రావ‌తి రెండో ద‌శ‌లో 44 వేల ఎక‌రాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేక‌రించే అంశంలో కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాల‌న పూర్తియిన సంద‌ర్బంగా కేబినెట్‌లో చ‌ర్చ‌ జరగనుంది. కేబినెట్‌ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

 

 

Exit mobile version