AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్..
- ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ..
- వివిధ కీలకాంశాలపై చర్చ..
- ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. వివిధ కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్లో సమీక్ష జరగనుంది.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.. వూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ. ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం సభలో బిల్లు పెట్టాలా..? లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలా..? అనే అంశంపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చించే అవకాశం ఉండగా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి..
Read Also: Harbhajan Singh Apology: తెలియక తప్పు జరిగింది.. నన్ను క్షమించండి: హర్భజన్ సింగ్
Also Read
- AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
మరోవైపు.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ వేసే అంశంపై కేబినెట్లో ప్రస్తావించనున్నారు.. ఇప్పటికే టీటీడీ విషయంలో ధర్మారెడ్డి, ఐ అండ్ పీఆర్ లో అక్రమాలపై తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే.. వీటితో పాటు.. ఇతర అక్రమాలను సీఐడీకి అప్పగించే ఛాన్స్ ఉండగా.. దీనిపై చర్చించనున్నట్టుగా సమాచారం.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్.. డయేరియా నివారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చర్చ సాగనుండగా.. శాంతి భద్రతలపై మరింత దృష్టి సారించాలనే దిశగా మంత్రి వర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. మహిళలు, మైనర్ బాలికల పట్ల లైంగిక వేధింపులను అరికట్టేలా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్ట పరిచే దిశగా కేబినెట్లో సమాలోచనలు చేయనున్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ, నివారణకు యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కేబినెట్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ANTF.. జిల్లాల్లో కూడా ATNF టీమ్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే నెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల పునః ప్రారంభంపై చర్చించనుంది కేబినెట్.. 180కు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభించే అవకాశం ఉంది.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చ సాగనుంది.. మరోవైపు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న ఆయన.. వివిధ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలుస్తారుని తెలుస్తోంది.
తాజావార్తలు
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
-
Allari Naresh : కామెడీ స్టార్ ‘అల్లరి నరేశ్’ ఈసారైనా నవ్విస్తాడా?
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!