NTV Telugu Site icon

AP Cabinet: 24న ఏపీ కేబినెట్‌ తొలి సమావేశం.. వాటిపై ఫోకస్‌

Pk Babu

Pk Babu

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారాలతో పాటు.. అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయడం.. స్పీకర్‌ ఎన్నిక ఇలా అన్నీ పూర్తి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, కేబినెట్‌ సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 25, 26 తేదీల్లో తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో పర్యటించనున్న సీఎం.. అంతకంటే ముందే.. అంటే ఈ నెల 24వ తేదీన తొలి కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దిశా నిర్దేశం చేయనున్నారట సీఎం చంద్రబాబు.

Read Also: Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్‌ కీలక వ్యాఖ్యలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై తొలి కేబినెట్‌లో కీలకంగా చర్చ సాగుతుందని తెలుస్తుంది. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక ప్రస్తావన ఉంటుందని సమాచారం.. ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పులపై ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది కొత్త ప్రభుత్వం. రూ. 14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చిందట.. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కూడా తొలి కేబినెటలో కీలక ప్రస్తావన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తొలి కేబినెట్‌లో ఎలాంటి చర్చ సాగనుంది.. కేబినెట్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.