Site icon NTV Telugu

AP Budget 2023: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం

Apcabinet

Apcabinet

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బడ్జెట్ సమయం వచ్చేసింది. ఏపీ ఆర్థికమంంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన లెక్కల చిట్టా రేపు అసెంబ్లీలో విప్పనున్నారు. అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇటు శాసనమండలి లో ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. రేపు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 8 గంటలకు మొదటి బ్లాక్ లో జరుగనున్న సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ను ఆమోదించనుంది మంత్రి మండలి. ఇదిలా ఉంటే ఉదయం 7:30 గంటలకు బడ్జెట్ ప్రతులకు పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. సచివాలయంలోని సెకండ్ బ్లాక్ తన ఛాంబర్ లో పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన.

2023-24 ఏడాదికి ఏపీ ప్రభుత్వ బడ్జెట్ గురువారం ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఆర్థికపరమైన విమర్శలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ క్రమంలో సంక్షేం.. అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. ఉభయ సభల్లో ఒకే సమయానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రులు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్టులో వివిధ శాఖలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయోననే అంశంపై ఆసక్తి నెలకొంది.

వ‌చ్చే ఆర్ధిక సంవ‌త్స‌రానికి వార్షిక బ‌డ్జెట్టును గురువారం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టనుంది ప్ర‌భుత్వం. ఉద‌యం 11 గంట‌లకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో బడ్జెట్టు ప్రవేశ‌ పెట్టనున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవ‌సాయానికి ప్రత్యేక బ‌డ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్టును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టాక.. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్టును మంత్రి కాకాని ప్రజెంట్ చేయనున్నారు. ఈసారి మాత్రం సుమారు రెండు ల‌క్షల 65 వేల నుంచి 70 వేల కోట్ల మధ్య బ‌డ్జెట్ అంచ‌నాలు రూపొందించిన‌ట్లు తెలిసింది. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లుండ‌టంతో ఇదే చివ‌రి పూర్తి స్థాయి బ‌డ్జెట్ అవుతుంది. అంతేకాదు ఎన్నిక‌ల బడ్జెట్ కావ‌డంతో గతం కంటే ఎక్కువ‌ కేటాయింపుల‌తో బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేసిన‌ట్లు తెలుస్తోంది.

గతేడాది గ్రామీణాభివృద్దితో పాటు విద్య‌, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాల‌కు అధిక కేటాయింపులు చేసింది ప్ర‌భుత్వం. వ్య‌వ‌సాయ బ‌డ్జెట్టును 13వేల 630 కోట్ల‌ రూపాయలతో ప్ర‌వేశ‌పెట్టింది. ఈసారి కూడా న‌వ‌ర‌త్నాలు, సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయింపులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఈసారి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు అందించే స‌మ‌యంలోనే ఆర్ధిక శాఖ అధికారులు ప‌లు శాఖ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. కేటాయింపులు ఎక్కువ‌గా చేసినా కొన్ని శాఖ‌ల్లో ఆమేర పూర్తిస్థాయిలో ఖ‌ర్చు పెట్ట‌డం లేదు.

Read Also: Hyderabad Crime: భార్యని నరికి, పసికందును సంపులో వేసి.. భర్త పరార్

దీంతో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌వుతుంది. దీంతో ఈసారి ఖ‌చ్చిత‌మైన లెక్క‌ల‌తో అంచ‌నాలు త‌యారు చేయాల‌న్న సూచ‌న‌ల‌తో శాఖ‌లు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నాయి. గతేడాది సంక్షేమ ప‌థ‌కాల‌ అమల్లో భాగంగా డీబీటీల కోసం 48 వేల కోట్ల రూపాయల మేర కేటాయించింది ప్ర‌భుత్వం. ఈసారి ఆ మొత్తాలను 50 వేల కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తున్న‌ట్లు తెలిసింది. మొత్తం 21 ప‌థ‌కాల‌కు నేరుగా ల‌బ్దిదారుల ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ చేయ‌నుంది ప్ర‌భుత్వం.

ఇక న‌వ‌ర‌త్నాల‌తో పాటు విద్య‌, వైద్య రంగాల‌కు మొద‌టి నుంచి అధిక ప్రాధాన్య‌త ఇస్తుంది ప్ర‌భుత్వం. విద్య‌, వైద్య రంగాల్లో నాడు-నేడు కోసం భారీగా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంది. మ‌హిళాభివృద్ది కోసం ప్ర‌త్యేకంగా కేటాయింపులు చేయనుంది. గ‌తేడాది త‌క్కువ కేటాయింపులు చేసిన వివిధ శాఖ‌ల‌కు ఈసారి కాస్త ఎక్కువ‌గా కేటాయింపులు చేసిన‌ట్లు స‌మాచారం. మొత్తంగా ఎన్నిక‌ల బ‌డ్జెట్ కావ‌డం, 98 శాతం హామీలు నెర‌వేర్చామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం.. ఈసారి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ఎలా ముందుకెళ్తుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది. ఇక ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హౌసింగ్ వంటి శాఖలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది.

Read Also:Rishabh Pant : వేగంగా కోలుకుంటున్న రిషబ్.. స్విమ్మింగ్ పుల్ లో హల్ చల్

Exit mobile version