Site icon NTV Telugu

AP Cabinet: మంత్రులు ఇక రోజులు లెక్కపెట్టుకోండి.. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Cm Chandrababu Warning

Cm Chandrababu Warning

ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ మంత్రులు.. ఇక రోజులు లెక్కపెట్టుకోండి అని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకున్నా.. కార్యకర్త, నాయకులకు గౌరవం ఇవ్వకున్నా.. మీ ప్లేస్‌లో కొత్తవారు వస్తారని మంత్రులకు స్పష్టం చేశారు. ఇక నుంచి మీరు 1995 సీఎంను చూస్తారని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. నేడు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో 12 అంశాలపై చర్చించారు.

మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయడం లేదని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేతలు కించపరిస్తే.. వెంటెనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలపై ప్రతి మంత్రీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు చేస్తే కేవలం సబ్జెక్టు మాత్రమే ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం దుష్ప్రచారం ఎక్కువైందని, మహిళలపై అసభ్య పదజాలం మాట్లాడుతున్నారని మంత్రులకు సీఎం వివరించారు.

Also Read: Kinjarapu Atchannaidu: జగన్ సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?.. అచ్చెన్నాయుడు ఫైర్!

ఏడాది వ్యవధిలో నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గించాం అని సీఎం చంద్రబాబు చెప్పారు. నిత్యావసర ధరలు తగ్గించి ప్రజలకు లభ్ధి చేకూర్చడంలో మంత్రివర్గ ఉపసంఘం బాగా కృషి చేసిందని ప్రశంసించారు. చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు. ఏపీలో ఏ నిత్యావసర వస్తువు ధర ఎంత మేర తగ్గిందో కేబినెట్‍లో సీఎం చంద్రబాబు స్వయంగా చదివి వినిపించారు. ఇండోసోల్‍కి భూములు వద్దని రైతులను రెచ్చగొట్టించిందే వైఎస్ జగన్ అని, అదే జగన్ పరిశ్రమలు తరలిపోతున్నాయ్ అంటూ తన మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చెప్పారు.

Exit mobile version