AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ, సంక్షేమ దిశానిర్దేశాలకు వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో సుమారు 30కి పైగా ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై మంత్రివర్గం హర్షం వ్యక్తం చేయగా, సీఎం చంద్రబాబు మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. స్థానిక ఎన్నికల విజయం చూసి గర్వంతో విర్రవీగిపోవద్దని, మరింత ఒద్దికగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తూ, 2029 లక్ష్యంగా అందరూ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మేలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యమిస్తూ, విశాఖలో జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌పై కేబినెట్ సమీక్షించింది. భీమిలిలో రూ. 31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్, నాయుడుపేటలో రూ. 4,000 కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ పరిశ్రమ, రాంబిల్లిలో రూ. 570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ, తిరుపతిలో రూ. 700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్, జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్‌కు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు భూ కేటాయింపులు చేయగా, నిబంధనలు పాటించని తిరుపతిలోని కొన్ని సంస్థల భూ కేటాయింపులను రద్దు చేసింది. విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌తో పాటు సోలార్, బయోగ్యాస్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చింది.
Also Read
- Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
- Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
- Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రత్యేక చర్చ జరిగింది. రైతు బజార్లలో తక్కువ ధరలకే బియ్యం అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపగా, కూరగాయల ధరలు తగ్గినట్లే బియ్యం ధరలను కూడా అదుపులోకి తెచ్చి ప్రజలపై భారం పడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ లేదా అత్యవసర సమయంలో కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చి విద్యుత్ పునరుద్ధరణకు తీవ్రంగా శ్రమించిన విద్యుత్ సిబ్బంది సేవలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించగా, ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు నేరుగా ఉపయోగపడాలని ముఖ్యమంత్రి ముగించారు.
తాజావార్తలు
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
-
Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?