Site icon NTV Telugu

Purandeswari: జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది..

Purandeswari

Purandeswari

Purandeswari: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.

Read Also: Uddhav Thackeray: రామ మందిర వేడుకలకు ఆహ్వానం లేదు.. ఆ రోజు ఏం చేయబోతున్నారో చెప్పిన సీనియర్ నేత

ఇక పొత్తులపై మాట్లాడుతూ.. ఈ విషయంలో పార్టీ నేతలంతా కలసి చర్చించుకుంటున్నామని పురందేశ్వరీ తెలిపారు. పదిమందికి పది రకాల అభిప్రాయాలు ఉండటం తప్పు కాదు.. భిన్న అభిప్రాయాలు ఉండటం తప్పు కాదని చెప్పారు. అందరి అభిప్రాయాలను తీసుకొని ఢిల్లీలోని పెద్దలకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. పొత్తుల విషయంలో నిర్ణయం అనేది జాతీయ అధ్యక్షులు ఖరారు చేస్తారని పురందేశ్వరీ తెలిపారు. ఇక.. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read Also: Nawazuddin Siddiqui: టాలీవుడ్, బాలీవుడ్ కి తేడా ఇదే.. ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!

Exit mobile version