Nawazuddin Siddiqui: టాలీవుడ్, బాలీవుడ్ కి తేడా ఇదే.. ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saindhav actor Nawazuddin Siddiqui Exclusive interview: విక్టరీ వెంకటేష్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్సినిమ్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ మీడియా సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
నవాజుద్దీన్, నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన మీరు తెలుగులోకి రావడానికి ఎందుకింత ఆలస్యమైంది?
-ప్రతి నటుడు ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తారు. నేను కూడా అలా సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. అది ‘సైంధవ్’ తో కుదిరింది. చాలా ఆసక్తికరమైన కథ ఇది. వెంకటేష్ గారితో కలిసి పని చేయడం ఎవరికైనా ఒక డ్రీం. ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా వుంది.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇప్పుడు మీరు విలన్ పాత్రలు తగ్గించారు కదా, సైంధవ్ లో విలన్ గా కనిపించడానికి ప్రత్యేకమైన కారణం ఉందా ?
-నేను ఎప్పుడూ విలన్, హీరో పాత్ర అని చూడలేదు. పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా అనేదే ముఖ్యం. కొన్ని సార్లు పాజిటివ్ రోల్స్ కంటే నెగిటివ్ రోల్స్ లో పెర్ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైంధవ్ లో దర్శకుడు శైలేష్ చాలా యూనిక్ రోల్ ని డిజైన్ చేశారు. నటించడానికి చాలా అవకాశం వున్న పాత్ర.
తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పారు కదా? దీనికి స్ఫూర్తి ఏమిటి ? తెలుగు భాష నేర్చుకోవడంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారు ?
-ఈ విషయంలో దర్శకుడు శైలేష్ ప్రేరణ ఇచ్చారు. నా నటనకు వేరే ఎవరో డబ్బింగ్ చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలో ఆ డెప్త్ రాదు. ఇందులో నాది హైదరాబాది పాత్ర. హిందీ, కొంచెం తెలుగు రెండూ మాట్లాడే పాత్ర. ఆ పాత్రకు నేను డబ్బింగ్ చెబితేనే న్యాయం జరుగుతుంది. భాషని, భావాన్ని అర్థం చేసుకొని చెప్పా. ఏదైనా కొత్త భాష నేర్చుకున్నప్పుడు మొదట్లో కొంత కష్టంగా ఉంటుంది. భాష గురించి తెలుసుకున్న కొద్ది అది సులువైపోతుంది. నాకు ప్రామ్టింగ్ మీద నమ్మకం లేదు. ఎంత కష్టమైన నా డైలాగులు నేర్చుకుని చెప్పడమే ఇష్టం. సైంధవ్ లో కూడా అలా ప్రతిది నేర్చుకొని చెప్పా.
తెలుగు సినిమాలు చూస్తారా ?
చాలా తెలుగు సినిమాలు చూశా. వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సబ్జెక్ట్ చూస్తుంటా. ఆయన హిందీలో చేసిన అనారి సినిమా కూడా చూశా.
ఒక నటుడిగా మీ నుంచి మిగతా వాళ్ళు చాలా నేర్చుకుంటారు కదా.. అలా మీరు వెంకటేష్ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
ప్రతి నటుడిని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. వెంకటేష్ గారు చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. లొకేషన్ కి వచ్చిన ముందు డైలాగ్స్ అన్నీ నేర్చుకుని వస్తారు. యాక్షన్ సీన్స్ లో చాలా రిస్క్ లు తీసుకున్నారు. ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ చేశారు. ఇందులో ఆయనది చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఈ ప్రయాణంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా ఆయనకు సహనం ఎక్కువ. అది ఆయన నుంచి తప్పకుండా నేర్చుకోవాలి.
ఇది వెంకటేష్ 75 వ చిత్రం.. ఇందులో భాగం ఎలా అనిపించింది ?
వెంకటేష్ తో కలిసి పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇందులో వెంకటేష్ ది చాలా డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. కొత్త అవతార్ లో వెంకీ ని చూస్తారు. ఆయన 75 వ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది.
దర్శకుడు శైలేష్ గురించి ?
శైలేష్ చాలా ప్రొఫిషనల్ డైరెక్టర్. తనకు చాలా క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ కూడా తన మైండ్ లో ఉంటుంది. ఎంత షూట్ చేయాలనేది తనకు పూర్తి క్లారిటీ ఉంటుంది. నా క్యారెక్టర్ ని చాలా ఇంప్రూవ్ చేశాడు. అవకాశం వున్న ప్రతి చోట మెరుగుపరిచారు. తను కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా పెద్ద విజయం సాధించే చిత్రం అవుతుందనే నమ్మకం కలిగింది. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో అంతే అద్భుతంగా చిత్రాన్ని తీశారు. తను చిత్ర పరిశ్రమలోకి వచ్చి కేవలం ఐదేళ్ళు అవుతుంది. కానీ చాలా అపూర్వమైన అనుభవం అతనిలో కనిపిస్తుంది. అన్ని విషయాలపై తనకు సంపూర్ణమైన స్పష్టత ఉంటుంది.
ఇందులో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
హెవీ యాక్షన్ ఉన్న చిత్రమిది. యాక్షన్ సీక్వెన్స్ లు చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. మీరు చూస్తున్నపుడు ఇందులో యాక్షన్ ఎంత కష్టమో అర్ధమౌతుంది.
ఇందులో మీకు మెమరబుల్ మూమెంట్ ?
శ్రీలంక షెడ్యూల్ మర్చిపోలేను. సముద్రంలో బోట్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నాం. బోట్ పై స్పీడ్ గా వెళుతున్నాను. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. దీంతో ఒక్కసారి బోట్ వదిలేసి అలతో పాటు పైకి లేచాను. అదృష్టవశాత్తు.. మళ్ళీ బోట్ లోనే ల్యాండ్ అయ్యాను. (నవ్వుతూ) ఆ సీన్ సినిమాలో ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
ఇందులో మీ పాత్ర లెంత్ ఎలా ఉంటుంది ?
ఈ చిత్రం కోసం దాదాపు 40 రోజులు పని చేశా. నా పాత్ర పట్ల చాలా తృప్తితో ఉన్నా. చాలా మంచి క్యారెక్టర్. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది.
సైంధవ్ ప్రొడక్షన్ హౌస్ గురించి ?
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ప్రొఫిషినల్ ప్రొడక్షన్ హౌస్. భవిష్యత్తులో వారి చేసే చిత్రాలలో నటించాలని కోరుకుంటా.
టాలీవుడ్, బాలీవుడ్ వర్కింగ్ స్టైల్ లో ఎలాంటి తేడా గమనించారు ?
టాలీవుడ్ చాలా ప్రొఫెషనల్ గా వుంది. ఇక్కడ సమయపాలన చక్కగా వుంది.
తెలుగు పరిశ్రమలో మీకు స్నేహితులు ఉన్నారా ?
నాని, రానాతో కలిసి మాట్లాడా. వారితో కలసినప్పుడు నటన గురించి చాలా అంశాలు పంచుకున్నాం.
టాలీవుడ్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ?
అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఒక యూనిక్ నెస్ ఉంటుంది.
మీకు డ్రీమ్ రోల్ ఉందా ?
ఓషో పాత్ర చేయాలని వుంది. అవకాశం వస్తే ఆయన బయోపిక్ చేస్తా
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!