Purandeswari: బీజేపీ కేంద్ర అధిష్ఠానం నిర్ణయం మేరకే టికెట్ల కేటాయింపు జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో ఆమె టికెట్ల కేటాయింపుపై వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బీజేపీ కార్యకర్తలు అంతా గౌరవిస్తున్నారన్నారు. రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా టికెట్లు కేటాయింపు తప్ప ఎవరిని పక్కన పెట్టలేదన్నారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు భవిష్యత్తు కేంద్ర అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు. వలస వచ్చిన వారికి టిక్కెట్లు కేటాయించామని అనడం సమంజసం కాదన్నారు.
Read Also: Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న సూరీడు.. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు
పాతవారు కొత్తవారు అందరూ బీజేపీ వారేనని.. బీజేపీ-జనసేన-టీడీపీ కూటమిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదే మా ఆలోచన అంటూ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీకి ఇంకొన్ని సీట్లు పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నామన్నారు. 11వ సీటు వస్తుంది.. పోటీ ఎక్కడ నుండి అనేది నిర్ణయిస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.