ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారు.. మోడీ సర్కార్ భాగ్యస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదు అని ఆమె అన్నారు. కార్యకర్తలను కలవాలని ఈ పర్యటనలు చేస్తున్నాను.. జిల్లాలలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను అని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహిర్తించడం లేదు అని పురంధేశ్వరి ఆరోపించారు.
Read Also: Challan: పెండింగ్ చలాన్లు కట్టేందుకు జనం క్యూ.. కోట్లు కుమ్మరిస్తున్న ఆఫర్
ఇక, రాష్ట్రంలో స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. కాకినాడలో పెట్రో కెమికల్ కారిడర్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదు అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని ఆమె కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నప్పటి ఎలాంటి సహాయం అందడం లేదని జగన్ సర్కార్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు.