AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Winter Session 2026: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సుమారు 15 రోజుల పాటు సమావేశాలు కొనసాగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులతో పాటు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది.
శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం కీలకమైన పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక సంస్థలకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. పెట్టుబడులకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో చట్టపరమైన భరోసా కల్పించేలా నిబంధనలు రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అలాగే పరిశ్రమలకు ప్రకటించిన ప్రోత్సాహకాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఎస్క్రో విధానాన్ని తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ బిల్లులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థల్లో విశ్వాసం పెంచడంతో పాటు మరిన్ని పరిశ్రమలను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Also Read
- Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
- Weight Loss Injection: 'ఫ్యాట్ టూ ఫిట్' పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
- Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
- Varanasi: వారణాసిలో విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాదా..?
అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రానికి వచ్చిన భారీ పెట్టుబడులు, వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి, పరిశ్రమల పురోగతిపై ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై కూడా చర్చ జరగనుంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వాటి పురోగతిపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలు కూడా ఈ సమావేశాల్లో కీలక అంశాలుగా మారనున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి పథకాల అమలు తీరును ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరించే అవకాశం ఉంది. ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలను కూడా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
AP Assembly Winter Session: డిసెంబర్ 5 నుంచి శీతాకాల సమావేశాలు.. పెట్టుబడులు, పరిశ్రమల పురోగతిపై చర్చ!
-
Nidadavole Municipality: నిడదవోలు వైస్ చైర్మన్ పదవిపై ముదురుతున్న వివాదం.. కూటమిలో కలకలం!
-
Delhi riots UAPA case: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు షాక్.. మధ్యంతర బెయిల్ నిరాకరణ!
-
Weight Loss Injection: ‘ఫ్యాట్ టూ ఫిట్’ పేరుతో భారీ మోసం.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు..!
-
Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
ట్రెండింగ్
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!
-
Vaibhav Sooryavanshi Batting: వైభవ్ సూర్యవంశీ విద్వంసకర ఇన్నింగ్స్ చూడలేదా?.. ఈ వీడియో మీకోసమే!
-
Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!
-
ధోనీ కోసం ప్రత్యేక గది.. చెన్నై ITC హోటల్లో MS Dhoni Tribute Room ప్రారంభం.. ప్రత్యేకతలివే!