Site icon NTV Telugu

YSRCP Rebel MLAs: విచారణకు రండీ.. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్‌ నోటీసులు..

Tammineni Sitaram

Tammineni Sitaram

YSRCP Rebel MLAs: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలను మరోసారి విచారణకు పిలిచారు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్.. ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా ముగ్గురు వైసీపీ రెబెల్స్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, ఈ నెల 8వ తేదీన జరిగిన విచారణకు హాజరు కాని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇచ్చారు.. ఈ నెల 12వ తేదీన అనర్హత పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టనున్నారు.. మరోవైపు.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు గైర్హజరైన విషయం విదితమే..

Read Also: Uttam Kumar Reddy: కృష్ణా బోర్డుకు మేము ప్రాజెక్టులు అప్పగించలేదు..

కాగా, అనర్హత నోటీసుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాంను వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కలిసిన విషయం విదితమే.. స్పీకర్ తో పర్సనల్ హియరింగ్ కు హాజరుకావడం రెండోసారి అని ఈ సందర్భంగా పేర్కొన్న ఆయన.. మొదటి సారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారనీ.. అవన్నీ తాను చెప్పినట్లు ఆనం తెలిపారు. దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అనర్హత నోటీసుపై స్పీకర్‌కు 5వ తేదీన తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇచ్చామని అన్నారు. మీడియాలో ప్రచురించిన వాటిని చీఫ్ విప్ ప్రసాదరాజు ఆధరైజ్ చేసి ఇచ్చారని ఆనం తెలిపారు. వేరే మేనేజ్మెంట్ కు సంబంధించినవి మీరెలా ఆధరైజ్ చేస్తారని అడిగానన్నారు. ఆరోపించిన ప్రసాదరాజు ఆథరైజ్ చేస్తే వాటికి విలువ ఉండదని అన్నారు. పెట్టిన‌ సాక్ష్యాధారాలు ఏవీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం విలువైనవి కావని ఆరోపించారు. ఇవి తీసుకుని మీరెలా చేస్తారని స్పీకర్ ను అడిగినట్లు ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించిన విషయం విదితమే.

Exit mobile version