NTV Telugu Site icon

AP Assembly: మీసం తిప్పిన బాలయ్య.. సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన స్పీకర్‌

Balayya

Balayya

ఏపీ అసెంబ్లీలో మీసాలు మెలేయడం, తొడగొట్టడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డ స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. వారిని సభ నుంచి సస్పెండ్‌ చేశారు.. మరోవైపు.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. టీడీపీ సభ్యుల తీరు అభ్యంతరకరమన్న స్పీకర్‌.. సభ ఔనత్యాన్ని తగ్గించేలా తొడలు కొట్టడం.. మీసాలు మిలేయడం లాంటి చర్యలు సభలో చేయడం తప్పు.. కానీ, సభా స్థానంలో తొడగొట్ట, మీసాలు మిలేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి.. సభ ఆయనకు మొదటి హెచ్చరిక చేస్తోంది. ఇలాంటి చర్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది సభ హెచ్చరిస్తోందని పేర్కొన్నారు.

మీసాలు మెలేయడం వంటి వికృత చేష్టలు చేయడం తప్పు.. స్పీకర్‌ స్థానాన్ని అగౌరవపరిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని ప్రసాద్‌, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పయ్యావు కేశవ్‌ను ఈ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయగా.. మిగతా టీడీపీ సభ్యులను అందరినీ ఒక రోజు సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, లాబీల్లో కూడా నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు.. సభ లోపల ఫోన్లలో వీడియో తీశారు టీడీపీ సభ్యులు పయ్యావుల, ఉండి ఎమ్మెల్యే రామరాజు… స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.. సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.. సస్పెన్షన్ సందర్భంగా వైసీపీ-టీడీపీ సభ్యుల మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.. బెందాళం అశోక్- బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. .

Show comments