Site icon NTV Telugu

AP Speaker: దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ap Speaker

Ap Speaker

AP Speaker: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్పీకర్‌కు ఆలయ ఈఓ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్పీకర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేసారు. వేదాశీర్వచనం అనంతరం ఈఓ రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు అందజేశారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Read Also: Diarrhea Cases: కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం.. ఇప్పటివరకు ఇద్దరు మృతి

 

Exit mobile version