NTV Telugu Site icon

AP Assembly Sessions: ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భద్రతాపరంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా అధికారులందరూ ప్రిపేర్ కావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ జరపాలని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు సభ ముగియనుంది. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సభలో మూడు అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక అంశాలపై సభలోనే శ్వేత పత్రాల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: Gandharva mahal: వందేళ్ల ‘‘గంధర్వ మహాల్’’.. ఆచంటలో అద్భుత కట్టడం..