Site icon NTV Telugu

AP Assembly Sessions 2024 LIVE UPDATES: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

Ap Assembly

Ap Assembly

AP Assembly Sessions 2024 LIVE UPDATES: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

 

The liveblog has ended.
  • 22 Jul 2024 10:53 AM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

    ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

  • 22 Jul 2024 10:50 AM (IST)

    గవర్నర్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు ఇవే..

    గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన గవర్నర్.

    ఏపీకి విభజన నష్టాలకంటే ఎక్కువ నష్టం గత ప్రభుత్వ విధానాల వల్ల జరిగిందన్న గవర్నర్.

    ప్రజా వేదిక కూల్చివేతతో గత ప్రభుత్వం విధ్వంసకర విధానాన్ని ప్రారంభించింది.

    గత పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది.

    ఏపీలో రాజ్యాంగకరమైన విచ్ఛిన్నం జరిగిందా అనే అంశంపై న్యాయ విచారణ చేపట్టాలని హైకోర్టు కోరింది.

    బ్రాండ్ ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లింది.

    గత ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు తరలిపోయాయి.

    గత ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావం చూపింది.

    గతంలో అధిక పన్నులు విధించారు.. విద్యుత్ రంగంలో రుణాలు పెంచేశారు.
    గత ప్రభుత్వంలో భారీగా బిల్లులును పెండింగులో పెట్టి చెల్లింపులు నిలిపేశారు.

    చెల్లింపుల కోసం కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

    ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించాలని గతంలో 25 వేల కేసులు కోర్టుల్లో దాఖలయ్యాయి.

    2019-24 మధ్య కాలంలో మూలధన వ్యయాన్ని 60 శాతం మేర తగ్గించేశారు.

    మూలధన వృద్ధి రేటు 26.4 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయింది.

    గత వ్రభుత్వంలో అమరావతి ప్రాంతం పూర్తిగా నాశనమైంది.

    గత సర్కార్ విధానాల వల్ల యువత మాదక ద్రవ్యాల బారిన పడ్డారు.

  • 22 Jul 2024 10:44 AM (IST)

    గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని ప్రస్తావించిన గవర్నర్

    రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్రనష్టం చేశారు.. మూడు రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.. 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారింది.. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది.. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా రూ.19వేల కోట్లనష్టం వచ్చింది.. అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు.. నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చారు.. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తీసుకొచ్చారు.. వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించాం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించాం.. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాం.. సామాజిక భద్రత పెన్షన్లను రూ.4వేలకు పెంచాం.. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి. -గవర్నర్

  • 22 Jul 2024 10:35 AM (IST)

    శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నాం: గవర్నర్

    అమరావతి: వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారు.. వైసీపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు దిగింది.. వైసీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయి, సంస్థలు తరలిపోయాయి.. ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56 శాతం తగ్గించారు.. రోడ్లు, భవనాలపై వ్యయం 80 శాతానికి పైగా తగ్గించారు.. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో మూడు రాజధానులన్నారు.. గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి.. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నాం.-గవర్నర్

  • 22 Jul 2024 10:29 AM (IST)

    ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: ఏపీ గవర్నర్

    అమరావతి: వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం.. అశాస్తీయంగా జరిగిన విభజనతో ఏపీకి నష్టం జరిగింది.. విభజనతో రెవెన్యూలోటు కారణంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది.. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశాం.. అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగింది. -గవర్నర్

  • 22 Jul 2024 10:20 AM (IST)

    వైసీపీ సభ్యుల నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం

    ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్ల కండువాలతో జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు.

Exit mobile version