Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు సాగుదాం..
- డ్రగ్స్ వద్దు బ్రో, ఆపరేషన్ చైతన్యం కార్యక్రమాలను విస్తృతం చేయాలి..
- డ్రగ్స్ నివారణపై సమన్వయం కోసం త్వరలో దక్షిణ భారత రాష్ట్రాల కాంక్లేవ్..
- డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహనకు మంత్రుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు..
- మాదకద్రవ్యాల నివారణపై మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నివారణపై హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రుల బృందం ఉండవల్లిలో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… డ్రగ్స్ పై అవగాహన కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఈగల్ క్లబ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ దుష్ఫలితాలపై ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ వంటి కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ వద్దు బ్రో వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి యువతను చైతన్యం చేయాలని అన్నారు. డ్రగ్స్, గంజాయి చాక్లెట్ల వంటి వాటి రవాణాను నిరోధించేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిపై అధికారులు అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే క్లస్టర్ సమావేశాల్లో ఈగల్ యంత్రాంగాన్ని భాగస్వాములను చేసి, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు.
యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులతో నెలకోసారి టౌన్ హాలు సమావేశాల నిర్వహించి డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. విద్యార్థులను చైతన్యవంతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఔత్సాహిక ఉపాధ్యాయులకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. కేంద్రప్రభుత్వ నషా ముక్త్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో డ్రగ్స్ నివారణకు ఈగల్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. సింథటిక్ డ్రగ్స్ నివారణపై పంజాబ్ పోలీసులు చేపడుతున్న విధానాలను అధ్యయనం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఈగల్ విభాగం అధికారులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నివారణపై సమన్వయం కోసం త్వరలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ ను విశాఖపట్నంలో నిర్వహించాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై మంత్రులు పాల్గొనే ప్రతి సమావేశంలో ప్రస్తావించి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. డ్రగ్స్ పై పెద్దఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంత్రుల బృందం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
Also Read
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఒడిశా సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో నిఘాను పటిష్టం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డ్రోన్ నిఘాను విస్తృతం చేయాలని సూచించారు. డ్రగ్స్ పై అవగాహనకు బ్రేక్ ద సైలెన్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల విశాఖ, నర్సరావుపేటలో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయని, అయితే అవి బీహార్, యూపీ నుంచి వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి అప్రమత్తం చేశామని అన్నారు. మత్తుకోసం షెడ్యూల్ డ్రగ్స్, కాఫ్ సిరప్ వంటివి వాడుతున్న వారిపై నిఘా వేసి ఉంచామని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆ మందులను విక్రయిస్తున్న 20 మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ, రాజమండ్రిలో డ్రగ్స్ ను ఉపయోగించే బ్లేడ్ బ్యాచ్ లను గుర్తించి, కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ రవాణాను గుర్తించేందుకు 36 సుశిక్షిత జాగిలాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై అనుమానితులను గుర్తించి, రాపిడ్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ కు సంబంధించి 192మంది యాక్టివ్ రిపీట్ అఫెండర్స్ ను గుర్తించి, వారిపై తీవ్రమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!