స్టార్ హీరోయిన్ అనుష్క చాలా గ్యాప్ తీసుకోని ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సరోగసీ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.సెప్టెంబర్ 7న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గత కొద్దీ రోజులుగా హీరో నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎంతో బిజీ గా వున్నాడు.కానీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కడ కూడా అనుష్క కనిపించ లేదు.ఈ భామ సోషల్ మీడియా ద్వారానే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది.తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనింది.
ఈ ఇంటర్వ్యూ లో తన కెరీర్‌ఫై అనుష్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇకపై లేడీ ఓరియెంటెడ్ స్కిప్ట్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అనుష్క తెలిపింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. తెలుగులో హీరోయిన్‌గా ఓ రెండు సినిమాలు కమిట్ అయ్యానని వాటి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తానని అనుష్క తెలిపింది.బెంగళూరు నాగరత్నమ్మ బయోపిక్ గురించి కూడా అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ బయోపిక్ కథను కొన్ని రోజుల క్రితమే నేను విన్నాను.ఎంతగానో నచ్చిందని ఆమె చెప్పింది. అన్ని కుదిరితే తప్పకుండా ఈ బయోపిక్‌లో నటిస్తానని ఆమె పేర్కొన్నది.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ పాపులర్ అయిన అనుష్క ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఈ సినిమాల కారణంగానే అనుష్కకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని ప్రచారం కూడా జరుగుతోంది. వాటి కారణంగానే అనుష్క ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది..అలాగే అనుష్క తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.దేనికైనా టైమ్ రావాలి మనం అనుకుంటే జరగవు అని అనుష్క చెప్పింది. పెళ్లి బంధానికి నేను వ్యతిరేకం కాదని చెప్పింది. త్వరలోనే నా పెళ్లి గురించి అందరికి తెలియజేస్తాను అని అనుష్క చెప్పింది.