Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Sharma-Virat Kohli: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులకు సంబంధించిన ప్రతీ చిన్న విశేషం సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. సినిమా గ్లామర్, క్రికెట్ హంగామాతో నిత్యం బిజీగా ఉండే ఈ జంట, ఈసారి మాత్రం అందరి దృష్టినీ తమ ఆధ్యాత్మికతతో ఆకట్టుకుంది. ఇటీవల ముంబైలో ప్రముఖ భక్తి గాయకుడు కృష్ణ దాస్ నిర్వహించిన కీర్తన కార్యక్రమంలో విరాట్-అనుష్క జంట పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో అనుష్క శర్మ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. మొదటి వరుసలో కూర్చుని చేతులు తడుతూ, ఎంతో ఆనందంగా ‘రాధే గోవిందా’ నామాన్ని జపిస్తూ కీర్తనలలో లీనమయ్యారు. ఆమె పక్కనే ఉన్న విరాట్ కోహ్లీ కూడా నల్లటి టీ-షర్ట్ ధరించి ఎంతో ప్రశాంతంగా భజనలను ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
గ్లామర్ ప్రపంచానికి దూరంగా, అతి సాధారణంగా కనిపించిన అనుష్క శర్మ లుక్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం ఆమె మెజెంటా (మల్బరీ) రంగులోని ఒక సాధారణ అనార్కలీ సూట్‌ను ఎంచుకున్నారు. ఎలాంటి జరీ, ఎంబ్రాయిడరీ లేదా గ్రాండ్ ప్యాచ్ వర్క్స్ లేకుండా చాలా సింపుల్‌గా ఉన్న ఈ డ్రెస్, ఆ సమయానికి తగ్గట్టుగా ఎంతో పద్ధతిగా ఉంది. ‘ప్లేస్ ది డాట్’ బ్రాండ్‌కు చెందిన ‘ఘూమర్ అనార్కలీ మల్బరీ సెట్’ అని పిలిచే ఈ డ్రెస్ ధర సుమారు రూ. 10,900 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ అనార్కలీ సూట్‌కు మ్యాచింగ్ దుపట్టాను జత చేసి అనుష్క మరింత ముచ్చటగా కనిపించింది. లైట్ మేకప్, లూజ్ హెయిర్‌స్టైల్‌తో పాటు నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని ఎంతో నిండైన రూపంతో మెరిసిపోయింది. పటాటోపం లేకుండా, ఎంతో సాదాసీదాగా ఈ కీర్తనలో పాల్గొని భక్తి పారవశ్యంలో తేలియాడిన ఈ జంట తీరుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
- NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
- Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
- PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
తాజావార్తలు
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!