NTV Telugu Site icon

Virat-Anushka: ఆస్ట్రేలియాలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరుపుకున్న విరాట్-అనుష్క..

Virat

Virat

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బాలల దినోత్సవాన్ని (చిల్డ్రన్స్ డే) జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. గురువారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో వారి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా.. చిల్డ్రన్స్ డే రోజున విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలకు మ్యాగీని కూడ తినిపించారు. వారు ఆర్డర్ చేసిన మ్యాగీ సాధారణ మ్యాగీ కంటే ఆరోగ్యకరమైనది.

Read Also: Minister Narayana: ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన విద్య కోసం కొత్త ప్లాన్..

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ పిల్లలతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. అలాగే ఫోటో క్యాప్షన్‌లో.. చిల్డ్రన్స్ డే మెనూ – స్మైల్, గిగిల్ మరియు మిల్లెట్ నూడుల్స్‌ అని రాసింది. కాగా.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అంతకుముందు.. పెర్త్‌లోని ఒక కేఫ్‌లో తమ కుమార్తె వామికతో కలిసి కాఫీని ఆస్వాదిస్తున్న విరాట్, అనుష్కల ఫోటో వైరల్‌గా మారింది.

Read Also: Stephen Miller: ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..

Show comments