Anushka Sharma drops heartfelt post for Virat Kohli after IND vs NZ Match: ఐసీసీ ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర (75) హాఫ్ సెంచరీ చేయగా.. డారిల్ మిఛెల్ (130) సెంచరీ చేశాడు. భారత పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో సత్తాచాటాడు. ఆపై భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ (95; 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (39 నాటౌట్; 44 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
274 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (46), శుభ్‌మన్ గిల్ (26) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. ఈ ఇద్దరు వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ క్రీజులో ఉండడంతో భారత్ ఫాన్స్ విజయంపై ధీమాగా ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వడంతో భారం మొత్తం కోహ్లీపైనే పడింది. రవీంద్ర జడేజా అండతో విరాట్ టీమిండియాను విజయానికి చేరువ చేశాడు. అయితే 95 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మాట్ హెన్రీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
Also Read: Bajaj CNG Bike: దేశంలో తొలి సీఎన్‌జీ బైక్.. మైలేజీ, ధర డీటెయిల్స్ ఇవే!
విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయినా ఫాన్స్ మాత్రం తెగ సంబరపడిపోయారు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ 2023లో అతడు రెచ్చిపోయి ఆడుతున్నాడు. మెగా టోర్నీలో 5 మ్యాచులు ఆడిన విరాట్ 354 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు చివరి 13 ఇన్నింగ్స్‌లలో 779 పరుగులు చేశాడు. ఇందులో ఛేజింగ్ సమయంలోనే ఏక్కువగా పరుగులు చేశాడు. ఛేజింగ్ అంటే ఇష్టమని కోహ్లీ కూడా చాలాసార్లు చెప్పాడు. కివీస్ ఇన్నింగ్స్ అనంతరం కోహ్లీకి అతడి సతీమణి అనుష్క శర్మ ఓ నిక్ నేమ్ పెట్టారు. ‘స్టార్మ్ ఛేజర్’ అని అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీనికి కోహ్లీ ఫొటోను జత చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాన్స్ కూడా కరెక్ట్ నిక్ నేమ్ పెట్టారని ట్వీట్స్ చేస్తున్నారు.