మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది . త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో ఈ భామ మంచి పేరు సంపాదించింది. ప్రతి సినిమాలో ఎంతో ట్రేడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అందుకే అనుపమకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి అనుపమ సడన్ గా గ్లామర్ రోల్స్ చేస్తూ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది.
రీసెంట్ గా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు . ఆ బ్యూటీ తన పదేళ్ల కేరీర్లో ఎప్పుడూ కూడా ఇంత హాట్ హాట్ గా కనిపించలేదు. ట్రేడిషనల్ ఇమేజ్ ఉన్నఅనుపమ ఒక సినిమాలోనే లెక్క పెట్టుకోలేనన్ని లిప్ లాక్స్ చేయడం అలాగే క్లీవేజ్ షోలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టిల్లు స్క్వేర్ సినిమా తరువాత అనుపమ ఇమేజ్ మారిపోవడంతో ఆమెకు వరుసగా బోల్డ్ క్యారెక్టర్ల ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఆమెకు పారితోషం కూడా మరింత ఎక్కువగా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైవుతున్నట్లు సమాచారం.అయితే ఇప్పుడు అనుపమ కెరీర్ కన్ఫ్యూషన్లో పడినట్లు తెలుస్తుంది.రెమ్యూనరేషన్ కు ఆశ పడి మళ్ళీ అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుందా లేక ఈ ఇమేజ్ నుంచి బయటపడేందుకు అనుపమ మళ్ళీ ట్రెడిషనల్ రోల్స్ చేస్తుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు .