Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ

Anupama Parameswaran (2)

Anupama Parameswaran (2)

Anupama: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరిస్తున్న కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్‌పై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే హీరోయిన్లు ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయడం సాధారణమైన విషయమే. ఇదే విషయంపై విలేకరులు ప్రశ్నించగా, ఆమె సరదాగా సమాధానమిచ్చారు. “హైదరాబాద్‌లో నాకూ ఓ సొంత ఇల్లు ఉంది! ప్రస్తుతం అది నిర్మాణ దశలో (అండర్ కన్‌స్ట్రక్షన్) ఉంది. త్వరలోనే పూర్తవుతుంది, అప్పుడు అందరినీ తప్పకుండా పిలుస్తాను” అంటూ నవ్వుతూ వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరణ వల్లే హైదరాబాద్ తన సొంత ఊరిలా మారిపోయిందని అనుపమ మురిసిపోయారు.

ఆమె కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ క్రేజీ కళ్యాణం.. భద్రప్ప అనే దర్శకుడు పరిచయమవుతున్న ఈ సినిమాని మోసం జగన్మోహన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా దసరా సందర్భంగా రణబాలి, జైలర్ 2 లాంటి బడా బడ్జెట్ సినిమాలతో పోటీగా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించిన క్రమంలో అనుపమ ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అ ఆ సినిమాతో అనుపమ పరమేశ్వరన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.