Site icon NTV Telugu

Anudeep Katikala Arrest: పవన్ పై అనుచిత కామెడీ.. స్టాండప్ కమెడియన్ అరెస్ట్.?

Pawan

Pawan

Anudeep Katikala Arrest: పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై చట్టపరమైన చర్యలు ఊపందుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపాయి. అనుదీప్ కటికల తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, అలాగే ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర రీతిలో మాట్లాడారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు, దీనిపై జనసేన కార్యకర్త కృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం అనుదీప్‌పై FIR నమోదు చేశారు. కేసు నమోదైన సమయంలో అనుదీప్ తన తల్లిదండ్రులను కలవడానికి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అనుదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు బృందం అనుదీప్‌ను తీసుకుని కాకినాడకు బయలుదేరింది. నగరానికి చేరుకున్న తర్వాత అతడిని విచారించి, కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

Exit mobile version