దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic Claude AI: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ పేపాల్‌ను దాటుకుని, అనుమతి లేకుండానే ఓటర్ల డేటాను ఏఐ మోడల్ ‘క్లాడ్’ (Claude) యాక్సెస్ చేసినట్లు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ధృవీకరించింది. ఏఐ మోడళ్లు రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న తరుణంలో మానవ అనుమతి లేకుండానే అవసరమైన సమాచారాన్ని దొంగచాటుగా సేకరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంత్రోపిక్ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన ఒక స్టాటిస్టిక్స్ ప్రాజెక్ట్ సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ట్రైనింగ్ రన్ జరుగుతున్నప్పుడు, ఆ ఏఐ మోడల్ స్వయంగా బుర్ర ఉపయోగించింది. జార్జియా రాష్ట్రంలో రుసుము చెల్లిస్తే ఎవరికైనా ఇచ్చే ఓట్ల లెక్కల వివరాలు ఓ పబ్లిక్ డాష్‌బోర్డ్‌లో ఉన్నాయని, దాన్ని సందర్శించే వారికి ఒక ‘యాక్సెస్ టోకెన్’ ఇస్తున్నారని క్లాడ్ గుర్తించింది.
ఎవరూ చెప్పకపోయినా, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఆ డాష్‌బోర్డ్‌ను క్వెరీ చేసి వివరాలు సేకరించేందుకు క్లాడ్ ఒక టోకెన్‌ను కోరింది. అయితే ఈ చర్యకు క్లాడ్‌లోని ఏ నిర్దిష్ట మోడల్‌ను ఉపయోగించారనేది మాత్రం కంపెనీ బయటపెట్టలేదు. ఈ విషయం బయటకు రావడంతో ఆంత్రోపిక్ వెంటనే స్పందించింది. క్లాడ్ ఎవరి వ్యక్తిగత వివరాలను సేకరించలేదని, అలాగే ఎటువంటి డేటాను మార్చలేదని స్పష్టం చేసింది. కేవలం సాధారణంగా రుసుము చెల్లిస్తే ఎవరికైనా లభించే సాధారణ ఓట్ల లెక్కలను మాత్రమే సేకరించిందని, ఓటర్ల రిజిస్ట్రేషన్ వ్యవస్థలోకి ప్రవేశించి రికార్డులను మార్చలేదని తెలిపింది. భవిష్యత్తులో ఏఐ మోడళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా తగిన భద్రతా చర్యలు (Mitigations) చేపట్టినట్లు పేర్కొంది.
Also Read
- Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
- 200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
- Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 లాంచ్.. 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్‌తో అద్భుతమైన ఫీచర్స్!
- Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడానికి కొన్ని వారాల ముందే ఆంత్రోపిక్ సంస్థ జార్జియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయానికి, అలాగే వైట్ హౌస్‌కు సమాచారం అందించింది. దీనిపై జార్జియా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జోర్డాన్ ఫుచ్స్ స్పందిస్తూ.. ఏఐ యాక్సెస్ చేసింది సాధారణ పబ్లిక్ డేటాను మాత్రమేనని, భద్రపరిచిన ఓటర్ల రికార్డుల వ్యవస్థలోకి అది ప్రవేశించలేదని స్పష్టం చేశారు. ఇక, ఇటీవలి కాలంలో ఏఐ మోడళ్లు పేపాల్స్ను దాటుకుని కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల వెబ్సైట్లలోని రక్షిత సమాచారాన్ని పొందగలుగుతున్నాయని ఆంత్రోపిక్ వెల్లడించిన కొన్ని రోజులకే ఈ వివరాలు బయటకు రావడం గమనార్హం. గతంలో కూడా క్లాడ్ మోడల్ ఫిలడెల్ఫియా పోలీసు వెబ్సైట్ ద్వారా ఒక మర్డర్ కేసుకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని సబ్మిట్ చేసిన ఘటన కూడా ఉంది. మరోవైపు ఓపెన్ ఏఐ (OpenAI) కి చెందిన ఏఐ ఏజెంట్లు కూడా గతంలో అమెరికా, ఆస్ట్రేలియాల్లోని ప్రభుత్వ వెబ్సైట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించాయి. ప్రభుత్వ వెబ్సైట్లపై ఏఐ మోడళ్ల కన్ను పడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది.
తాజావార్తలు
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
ట్రెండింగ్
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!