Answer Sheet Evaluation Using AI: పరీక్షల కోసం కష్టపడి చదివి రాసేవారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువయ్యారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని థీమాతో పరీక్షలు రాసేస్తున్నారు. ఇకపోతే పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడులో కృతిమ మేధస్సు (AI)తో చెక్ పెట్టబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ ప్రయోగం ఇప్పటికే మొదలైంది కూడా. పరీక్ష జవాబు పత్రాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తో దిద్దించే ప్రయోగాన్ని తమిళనాడు ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు యూనివర్సిటీల పరిధిలో ప్రయోగాలు నడుస్తున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం లోపల ఈ విధానంపై నిర్ణయం తీసుకోబోతున్నారు అధికారులు.
Telangana Medical Colleges: ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ
ఈ సాంకేతిక పనితీరును ఉపయోగించుకోవడం కోసం అందులో ఉన్న లోపాలను సవరించి మెరుగైన తీరుతో పని తీరు వచ్చిన తర్వాత అన్ని యూనివర్సిటీలలో వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వ అధికారులు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ పర్యవేక్షిస్తోంది. ఈ విధానంలో మొదట స్కాన్ చేసిన జవాబు పత్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి అనుసంధానం ఇస్తారు. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ జవాబు పత్రాన్ని పరిశీలించి తప్పుడు సమాధానం, అలాగే మళ్ళీ మళ్ళీ రాసిన విషయాన్ని ఇలాగే పట్టేస్తోంది. ఆ విషయాన్ని వెంటనే సంబంధిత ఎగ్జామినర్ కు తెలుపుతుంది.
IND vs BAN: చూసుకుందాం.. టీమిండియాకు బంగ్లాదేశ్ యువ పేసర్ వార్నింగ్!
ఇకపోతే అందరూ ఒక రకంగా సమాధానం రాయరు.. ఒక్కో విద్యార్థి ఒక్కోరకంగా చేతిరాత తీరుగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అర్థం కావాలంటే మరింత సమయం పడుతుంది. దానికోసం మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలలో ఈ విషయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదు. కేవలం ప్రొఫెసర్లకు సహాయం గాని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల సమాధాన పత్రంలోని లోపాలను గుర్తించే వేగవంతమైన ప్రక్రియ మరింతగా సాగుతోంది. మొత్తానికి భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సామర్ధ్యాన్ని పెంచి పరీక్ష పత్రం మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించేలా అభివృద్ధి చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక కమిషన్ కార్యదర్శి తెలిపారు.