Anshu Ambani : అన్నీ అలాంటి పాత్రలే.. అందుకే సినిమాలు చేయడం మానేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్షు అంబానీ..ఈ భామా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో కూడా నటించింది.అప్పట్లో ఈ బ్యూటీ అందానికి యూత్ పిచ్చెక్కిపోయారు. ఈ భామ చేసింది రెండు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. కానీ ఆ రెండు సినిమాలతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ ఎక్కడా కనిపించకుండా వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఈమె మీడియా ముందుకొచ్చింది. అప్పుడు అంత సడెన్‌గా ఎందుకు సినిమాలను వదిలేయాల్సి వచ్చిందో కారణాలను కూడా వివరించింది.తాను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. తన పూర్వీకులు భారతీయులేనని అన్షు అంబానీ చెప్పింది. తనకు 16 ఏళ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చానని.. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పింది. దీంతో తనకు తన కల నిజమైనట్టు అనిపించిందని తెలిపింది.
సినిమాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకున్నా అని.. కానీ చిన్న వయసు కావడంతో చదువుపై కూడా దృష్టి పెట్టాలని అనుకున్నా అని తెలిపింది. కానీ మంచి అవకాశాలు రావడంతో ఎక్కువ రోజులు సినిమాల్లో ఉండాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. ఇప్పుడంటే పీఆర్ టీమ్‌లు వున్నాయి..కానీ అప్పుడు అన్నీ వాళ్ల నాన్నే చూసుకునే వారని దీంతో ఎక్కడికి వెళ్లాలన్నా తన నాన్న పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేదని.. కథలు చెప్పడానికి ఎవరైనా వచ్చినా వాళ్లు ముందుగా నాన్ననే కలవాల్సి వచ్చేదని ఆమె తెలిపింది.దీనికితోడు మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ తెలిపింది.నేను తెలుగులో నటించిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గానే ఛాన్స్ వచ్చింది. ఆ రెండు సినిమాల్లో కూడా నా క్యారెక్టర్ చనిపోతుంది. ఈ సినిమాలు చూసి మరో రెండు మూడు చిత్రాల్లో ఇలాంటి రోల్స్‌నే ఆఫర్ చేశారు. ‘ అని తెలిపింది. ఇలా సేమ్ క్యారెక్టర్లు రావడంతో విసిగిపోయానని.. ఒకే తరహా పాత్రల్లో నటించడం కంటే ఖాళీగా ఉన్నది బెటర్ అనిపించి ఇండస్ట్రీని వదిలేసి వెళ్లానని ఆమె అసలు విషయం చెప్పింది.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!