NTV Telugu Site icon

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. కీలక వ్యక్తి అతనే

Phone Tapping Case

Phone Tapping Case

ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు. అంతేకాకుండా.. డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ తో పాటు పది మంది కానిస్టేబులు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్తో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న. ఈ క్రమంలో.. ప్రతి రోజు 40 మంది సెల్ ఫోన్లను టాపింగ్ చేశారు. మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గా తిరుపతన్న పని చేశారు. పిఓఎల్ 2023 పేరుతో ప్రత్యేక ఎలక్షన్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఎస్ఓటి టాస్క్ఫోర్స్లతో కలిసి పని చేశారు తిరుపతన్న.

PM Modi: ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం.. ఎక్కడంటే..!

ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించినట్లుగా దర్యాప్తులో తేలింది. మెరుపు దాడులు చేసి కాంగ్రెస్, బీజేపీ సానుభూతిపరుల డబ్బులను తిరుపతన్న సీజ్ చేశారు. ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు. రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్కు చెందిన డబ్బులను కూడా తిరుపతన్న స్వాధీన పరుచుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రఘురామిరెడ్డి డబ్బులను స్వాధీన పరుచుకున్నారు. అంతేకాకుండా.. రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున స్వాధీనపరుచుకున్నారు. ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులను పట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను సీజ్ చేశారు తిరుపతన్న. మరోవైపు.. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు వెంకటరమణారెడ్డి పైన నిగబెట్టారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లను తిరుపతన్న టీం ట్యాపింగ్ చేశారు. ఈ క్రమంలో.. మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది.

AAP: ఆప్‌కి మరో షాక్.. పరువునష్టం కేసులో మంత్రి అతిషీకి కోర్టు సమన్లు..

మరోవైపు.. నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో.. మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది.