Site icon NTV Telugu

Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

Virat Kohli Player Of The Series

Virat Kohli Player Of The Series

శుక్రవారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ రికార్డుల సునామీ సృష్టించాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ పరుగులతో మరో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే వేదిక‌లో అత్యధిక టీ20 ర‌న్స్ (3,276) చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే.. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ముష్ఫిక‌ర్ ర‌హీం పేరిట ఉండేది. అతను మీర్పూర్ వేదిక‌గా ఇప్పటివ‌ర‌కు 3,239 ప‌రుగులు చేశాడు. అయితే ఆ రికార్డును కోహ్లీ దాటేశాడు. ఇదిలా ఉంటే..ముష్ఫిక‌ర్ ర‌హీం రెండో స్థానానికి ప‌డిపోగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆట‌గాడు అలెక్స్ హేల్స్‌, బంగ్లా ప్లేయ‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జి వేదిక‌పై హేల్స్ 3,036 పరుగులు చేయగా.. మీర్పూర్ వేదిక‌గా త‌మీమ్ 3,020 ప‌రుగులు చేశాడు.

Read Also: Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?

మరోవైపు.. శుక్రవారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ త‌ర‌ఫున అత్యధిక సిక్సులు (241) కొట్టిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. ఇప్పటివ‌ర‌కు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (239) పేరిట ఉండేది. అత‌డు కూడా ఆర్‌సీబీ త‌ర‌ఫున 239 సిక్సులు బాదాడు. గేల్ త‌ర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియ‌ర్స్ (ఆర్‌సీబీ -238), కీర‌న్ పొలార్డ్ (ఎంఐ-221), రోహిత్ శ‌ర్మ (ఎంఐ-210) ఉన్నారు.

Read Also: YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు

ఇదిలా ఉంటే.. నిన్నటి మ్యాచ్ లో 83 రన్స్ చేసిన విరాట్ కోహ్లీ.. మ‌రో రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. కోల్ కతాపై అత్యధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివ‌ర‌కు కోల్‌క‌తాపై 33 మ్యాచులు ఆడిన కోహ్లీ 944 రన్స్ సాధించాడు. కాగా.. ఇంత‌కుముందు మూడో స్థానంలో 907 పరుగులతో శిఖ‌ర్ ధావ‌న్ ఉండగా… అత‌డిని దాటేశాడు. కాగా.. ఈ జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో డేవిడ్ వార్నర్ (1075), రోహిత్ శ‌ర్మ (1040) ఉన్నారు.

Exit mobile version