NTV Telugu Site icon

Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ ఖాతాలో మరో రికార్డు..

Jasprit Bumrah

Jasprit Bumrah

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్‌ టెస్ట్ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. టీమిండియాలో టెస్ట్ బౌలర్ ఈ రికార్డు సాధించలేదు. ఇంతకుముందు.. రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో అత్యధికంగా 904 పాయింట్లు సాధించాడు. తాజాగా.. బుమ్రా కూడా 904 పాయింట్లు సాధించాడు.

Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం

బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్లు తీయడంతో.. 14 పాయింట్లు పెరిగాయి. దీంతో.. 900 మార్క్‌ను అధిగమించి 904కి చేరుకున్నాడు. అంతకుముందు డిసెంబర్ 2016లో అశ్విన్ 904 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అయితే.. అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న తన ఆధిక్యాన్ని 48 రేటింగ్ పాయింట్లకు పెంచింది. ఈ జాబితాలో మాజీ టాప్ ర్యాంక్ బౌలర్ కగిసో రబడ (856) ప్రస్తుతం రెండో స్థానంలో.. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (852) మూడో స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా వికెట్లు సాధించకపోవడంతో టాప్ 10లోకి దిగజారాడు.

Read Also: Purandeswari: అట్టడుగు ప్రజలకు న్యాయం చేయడమే బీజేపీ అంతిమ లక్ష్యం

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఓపెనర్ సామ్ అయూబ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ జంప్ చేశారు. సౌతాఫ్రికాపై 2 సెంచరీలు చేసిన సామ్ అయూబ్ 57 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ టాప్ 5లోకి చేరాడు.

Show comments