టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం ఐసీసీ (ICC) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు.. బుమ్రా మరో రికార్డు సృష్టించాడు. బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనతో.. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన పేరు మీద రికార్డు రాసిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారత్ తరఫున 10వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. అంతే కాకుండా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసిన ఘనత సాధించిన ఆరో భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా.