Operation Chirutha: తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Chirutha: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో చిరుతల సంచారంతో భక్తులు భయాందోళనతో వణికిపోతూనే ఉన్నారు. అయితే, శేషాచలం కొండల్లో చేపట్టిన ‘ఆపరేషన్ చిరుత’ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.. వరుసగా చిరుతలు అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుతున్నాయి.. నడక మార్గంలో జరిగిన దుర్ఘటనలతో అలర్ట్ అయిన టీటీడీ.. ఫారెస్ట్ అధికారులతో కలిసి ఆపరేషన్ చిరుత చేపట్టారు.. చిరుత, ఇతర అడవి జంతువుల కదలికలను గుర్తించడానికి నడకమార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.. చిరుత కదలికలను గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేస్తూ వస్తుండగా.. వరుసగా చిరుతలను చిక్కుతున్నాయి.. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించిన ఫారెస్ట్ అధికారులు. ఈ రోజు మరో చిరుత బోనులో చిక్కింది.. దీంతో.. ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులకు చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది.. చిన్నారి లక్షితలపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే ఆరో చిరుతను ట్రాప్ చేశారు అటవీ శాఖ అధికారులు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
మరోవైపు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి.. ఈ రోజు ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇస్తూ తిరుమాడవీధుల్లో విహరించనున్నారు.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది.. రెండు కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది.. నిన్న శ్రీవారిని 67,267 మంది భక్తులు దర్శించుకోగా.. 20,629 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.58 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!