PKL 11: తెలుగు టైటాన్స్ మరో ఓటమి..

  • తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి
  • ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం.
Pkl

Pkl

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ మరోసారి ఓటమి పాలైంది. 21-51 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది.

Read Also: Drishyam Style Murder: “దృశ్యం” తరహాలో ప్రియురాలిని హత్య చేసిన ఆర్మీ జవాన్..

జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో అత్యధికంగా అర్జున్ దేశ్‌వాల్ 19 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. అభిజిత్ మాలిక్ 8, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 5, విజయ్ మాలిక్ 5 పాయింట్స్ చేశాడు. జైపూర్ పింక్ పాంథర్స్ జట్టులో రైడ్ పాయింట్స్, టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కాగా.. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

Read Also: Hardeep Singh Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్రమంత్రి గుడ్‌న్యూస్