NTV Telugu Site icon

Shocking Video: మొసలి కాలును కొరికి తినేసిన ఇంకో మొసలి.. చూస్తే గూస్ బంప్స్..!

Crocodile

Crocodile

భూమిపై క్రూరమైన జంతువులు చాలా ఉన్నాయి. కొన్ని జంతువులు మరికొన్ని జంతువులను వేటాడి తినడం, లేదంటే క్రూరంగా చంపి తినడం చూస్తే.. గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి వీడియోలను చూడటానికి మనుషులకు చాలా ధైర్యం కావాలి. ఐతే అలాంటి ప్రమాదకరమైన జంతువులను నియంత్రించడానికి జంతుప్రదర్శనశాలలలో ఉంచినప్పటికీ.. అవి ఎప్పుడు, ఎవరిపైన దాడి చేస్తాయో చెప్పలేం. అలాంటి భయంకరమైన జంతువులలో మొసళ్ళు కూడా ఉన్నాయి. అయితే వాటి నుండి దూరంగా ఉండటం మంచిది. ఈ జంతువులు తమ సొంత సహచరులను కూడా చంపి తింటాయి. అలాంటి వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kiccha Sudeep: సుదీప్ రివర్స్ ఎటాక్.. ఆ నిర్మాతలపై పరువునష్టం కేసు

ఈ వీడియోలో ఒక మొసలి మరొక మొసలి కాలు కొరికి తింటున్నట్లు కనిపిస్తుంది. అదొక అటవీ ప్రాంతం.. అక్కడ ఎన్ని మొసళ్లు ఉన్నాయో వీడియోలో చూడవచ్చు. ఒక మొసలి అకస్మాత్తుగా పక్కనే పడుకున్న మరో మొసలి ముందు కాలును తన దవడల్లో నొక్కుతూ కొరికేసింది. మీరు ఇంతకు ముందు ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి ఉండరు. జంతువు తన జాతికి చెందిన జంతువు కాలు కొరికి తినడం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇది మొసళ్లలో తరచుగా జరిగినప్పటికీ.. ఆకలిగా ఉన్నప్పుడు, తమ తమ పిల్లలను కూడా చంపి తింటాయి.

Vinod Kumar: మోడీ ఎక్కడకు వెళ్లిన అవినీతి అనే మాటలు తప్ప ఎలాంటి మాటలు రావు

ఈ గూస్‌బంప్స్ వైల్డ్‌లైఫ్ వీడియో వైల్డ్‌లైఫ్011 పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 1.3 మిలియన్ సార్లు వీక్షించారు. 40 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.