Site icon NTV Telugu

Uppal Stadium: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మరో గందరగోళం..

Hca

Hca

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం వద్ద మూడు రోజుల పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అండర్‌-16 బాయ్స్‌ సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని జిల్లాల నుంచి వందల మంది ఈ సెలక్షన్స్ కి హాజరు అయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్ రావడంతో HCA వెనక్కి పంపించింది. అన్ని జిల్లాల నుంచి ఒకేసారి ప్లేయర్స్ ను రమ్మని చెప్పడంతో గందరగోళం నెలకొంది.. దీంతో ఆటగాళ్లు నానా అవస్థలు పడ్డారు.

Read Also: PM Modi: ఖజానా ఖాళీ అయితే ప్రజలపైనే భారం: ప్రధాని మోడీ

ఉదయం నుంచి ఉప్పల్ స్టేడియం గేట్ బయటే పడిగాపులు గాస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో జిల్లా చొప్పున నిర్వహించకుండా.. ఒకేసారి అన్ని జిల్లాల నుంచి ఆటగాళ్లను పిలవడంతో ప్లేయర్స్ తో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమ పిల్లలు తిండి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వారి పేరేంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. HCA ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు.

Read Also: Kavin: పెళ్లి పీటలు ఎక్కనున్న ‘దాదా’ హీరో.. వధువు ఎవరంటే.. ?

ఇక, హెచ్‌సీఏను గాడిలో పెట్టేందుకు సుప్రీం కోర్టు నియమించిన సింగిల్ జడ్జి, రిటైర్డ్ జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు.. అసోసియేషన్‌ భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న 57 క్రికెట్ క్లబ్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. హెచ్‌సీఏ తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా వాటిపై నిషేధం విధించారు. ఆఫీస్ బేరర్ల ఎన్నిక, గుర్తింపు, యాజమాన్య బదిలీ, మల్టీపుల్ ఓనర్‌షిప్, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు తదితర ఫిర్యాదులపై సదరు క్లబ్‌ల ప్రతినిధుల నుంచి రిటైర్డ్ జస్టిస్ వివరణ కోరిన అనంతరం చర్యలు తీసుకుంటూ నిన్న (సోమవారం) ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version