NTV Telugu Site icon

Annatto Seeds : ఈ గింజలు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ

Annatto

Annatto

Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి. వృద్ధాప్యం మీ దరిదాపుల్లోకి రాదు. అవునండి ఇది నిజం.. ఇవి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలను ఎక్కువగా ఆహారానికి రావటానికి ఉపయోగిస్తారు. అలాగే రుచి, వాసనకు కూడా ఉపయోగిస్తారు. వాటినే అన్నాట్టో సీడ్స్ గా పిలుస్తారు. ఈ గింజల్లో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము, భాస్వరం, విటమిన్లు బీ2 , బీ3 ఉన్నాయి. వాటిలో బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలు, డీఎన్ఏకు ఫ్రీ-రాడికల్ కారణంగా కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి.

వీటిలో ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు , టానిన్లు ఉంటాయి. ఇవి మానవులలో వ్యాధిని నివారించడానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తుంది. పొడి చర్మం, ముడతలను తగ్గించటమే కాకుండా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. అందువల్ల వీటిని చాలా కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు.

అన్నాట్టో గింజలలో కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల కంటిశుక్లం పెరగకుండా చేస్తుంది. ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేసి మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్‌ను తగ్గించి మధుమేహాన్ని అదుపుచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను నయం చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ గింజల పొడిని సలాడ్స్ మీద జల్లుకోవచ్చు…లేదంటే మొలకల మీద జల్లుకోవచ్చు. లేదంటే కూరల్లో కూడా కలుపుకోవచ్చు.