Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకంకు ముహూర్తం ఖరారు!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త
- అన్నదాత సుఖీభవ పథకంకు ముహూర్తం ఖరారు
- పీఎం కిసాన్ యోజన నిధులు కూడా
- ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Farmers to Receive RS 7000 in First Phase on August 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. ‘అన్నదాత సుఖీభవ’ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. సూపర్ సిక్స్‌లో కీలక హామీ అయిన అన్నదాత సుఖీభవ పథకంను ఆగస్ట్ 2న ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. 7000 రూపాయలను తొలి విడత సాయం కింద రాష్ట్రంలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనుంది. అలానే కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజన నిధులు కూడా జమ కానున్నాయి.
రాష్ట్రంలోని 46 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది. ఏటా మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బును ప్రభుత్వం జమ చేయనుంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్, ఏపీ ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ కలిపి.. రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.20 వేలు అందనున్నాయి. పీఎం కిసాన్ కింద 6 వేలు, అన్నదాత సుఖీభవ కింద 14 వేలు రానున్నాయి. మొత్తంగా రైతులకు రెండు విడతల్లో 7 వేల చొప్పున.. ఓ విడతలో 6 వేలు బ్యాంక్ ఖాతాలలో పడనున్నాయి.
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
Also Read: AP Crime News: కోనసీమ జిల్లాలో దారుణం.. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి! కరస్పాండెంట్‌పై పోక్సో కేసు
మొదటి విడతగా రూ.7000 రైతుల ఖాతాలో ఆగస్ట్ 2న జమ కానున్నాయి. అర్హులైన రైతుల కుటుంబాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,325 కోట్ల నిధులు విడుదల చేసింది. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.831 కోట్లతో కలిపి మొదటి విడతలో 7000 రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. మొత్తంగా తొలి విడతలో రూ.3,156 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!