Site icon NTV Telugu

Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Anna Canteens Copy

Anna Canteens Copy

Anna Canteens: ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం ఆరున్నర గంటలకు అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. మొత్తం 33 మున్సిపాలిటీలలో 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించుకుంది. ఉయ్యూరులో ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా సంబంధిత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. వీటికి ఆహార సరఫరా కాంట్రాక్టును హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించినట్లు సమాచారం. వలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనాన్ని అన్న క్యాంటీన్‌ ద్వారా పేదలకు అందించనున్నారు. అయితే 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ అన్న క్యాంటీన్లను తీసుకువచ్చారు. నిరుపేదలకు తక్కువ ధరకే మూడు పూటల భోజనం పెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.

Read Also: Ambati Rambabu: తుంగభద్ర గేటు కొట్టుకుపోవడాన్ని జగన్ అకౌంట్‌లో వేయడం దారుణం

Exit mobile version