Bahishkarana : అంజలి బర్త్ డే స్పెషల్.. ‘బహిష్కరణ’ నుంచి పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాలో తన టాలెంట్ ను బయట పెడుతూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.. తాజాగా వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈరోజు అంజలి బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు..
తాజాగా మాస్ రోల్‌లో అభిమానులకు దర్శనమిచ్చేందుకు రెడీ అవుతోంది అంజలి. అయితే సినిమాలో కాదు వెబ్‌సిరీస్‌లో…అంజలి ప్రధాన పాత్రలో బహిష్కరణ పేరుతో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది.. నేడు అంజలి పుట్టినరోజు సందర్బంగా ఈ సిరీస్ నుంచి మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కొడవలి పట్టుకొని రౌద్రంగా అంజలి కనిపిస్తోంది. ఆమె పక్కనే ఛైర్ మంటల్లో తగలపడిపోతున్నట్లుగా మోషన్ పోస్టర్‌లో చూపించారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
Also Read
ఈ వెబ్ సిరీస్ కు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహిస్తోన్నాడు. ప్రశాంతి మలిశెట్టి నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో అంజలితో పాటు అనన్య నాగళ్ల,రవీంద్రవిజయ్,శ్రీతేజ్ కీలక పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం.. అంజలి పల్లెటూరు అమ్మాయిలాగా కనిపిస్తుంది.. ఊరి సర్పంచ్, అతని అనుచరుల వల్ల ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నది అనేది ఈ సిరీస్ స్టోరీ.. ఇక బహిష్కరణ వెబ్‌సిరీస్ జీ5 ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ కాబోతున్నట్లు జీ5 ప్రకటించింది..
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!