Anjali jhansi web series : అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ఝాన్సీ’ ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించిన ఈ సైకలాజికల్ యాక్షన్ డ్రామా గత నెల 27 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తాము రూపొందించిన వెబ్ సీరీస్ కి చక్కటి ఆదరణ లభిస్తోందని దర్శకనిర్మాతలు తెలియచేస్తూ ‘ఇందులో అంజలి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రతో ఆకట్టుకుంది. తను చేసిన స్టంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓటీటీ షోస్ రేటింగ్స్ లో మా ఝాన్సీ సెకండ్ ప్లేస్ ను సంపాదించుకుంది. అంతే కాదు 3.25 మిలియన్ యూనిక్ వ్యూయర్స్ తో 0.66 రీచింగ్ సాధించింది. ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ మా వెబ్ సిరీస్ కి అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. త్వరలోనే సెకండ్ సీజన్ ను విడుదల చేస్తాం’ అని అన్నారు.
Read Also: Superstar Krishna : పద్మాలయ స్టూడియో నుంచి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం