Nani : ‘నాని- శ్రీకాంత్ ఓదెల’ సినిమా కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani : న్యాచురల్ స్టార్ నాని ఇటీవల ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన తీరు అభిమానులని అబ్బుర పరిచింది. ఇక ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ‘హిట్’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో రూపొందిస్తున్నాడు.
Read Also:Off The Record : అందుకే పాత పద్ధతినే తిరిగి పాటిస్తున్నారా?
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
కాగా, సినిమా ఇండస్ట్రీలో హీరోల మార్కెట్ ని బట్టి నిర్మాతలు బడ్జెట్ నిర్ణయిస్తారు. హీరో, దర్శకుల కాంబోతో పాటు కథను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కథ డిమాండ్.. క్వాలిటీ తెరపై కనిపించి ప్రేక్షకులు మెచ్చుకుంటే పెట్టుబడి తిరిగి కలెక్షన్ల రూపంలో వస్తుంది. లేదంటే నిర్మాత నష్టపోవాల్సి వస్తుంది. ఇటీవల తెలుగు సినిమాల మార్కెట్ పెరిగింది. ఖర్చులు కూడా పెరిగాయి. అయితే నేచురల్ స్టార్ నాని తన సినిమాల నిర్మాణంలో నిర్మాతలకు ఓ కీలక విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఖర్చుల విషయంలో వెనక్కి తగ్గవద్దని సూచించినట్లు సమాచారం.
Read Also:Duddilla Sridhar Babu : మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం
ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నాని కెరీర్లో ఇది 33వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నాని, శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా సినిమాకు మించి మాస్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. ఈ క్రమంలో నిర్మాత సుధాకర్ చెరుకూరి.. ఖర్చు విషయంలో రాజీపడవద్దని, కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టాలని నానికి కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ‘హిట్-3’ ప్రాజెక్ట్ తరువాత పట్టాలెక్కనుంది. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!