Kavya -Anirudh Reception: చెన్నైలోని ఒకే వేదికపై పొలిటికల్ రైవల్స్ (Political Rivals), సినిమా దిగ్గజాలు కలిసి సందడి చేశారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kavya Maran) ల వెడ్డింగ్ రిసెప్షన్ శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉండే కీలక నేతలు ఒకేసారి హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారి ముఖ్యమంత్రి అయిన సి. జోసెఫ్ విజయ్ (C. Joseph Vijay), డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin), ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (Edappadi K. Palaniswami) ఈ రిసెప్షన్‌లో పాల్గొన్నారు.
ఈ వేడుకకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ బంధువైన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), మారన్ కుటుంబ సభ్యుడైన స్టాలిన్, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ (Kalanithi Maran), అలాగే విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. వీటితో పాటు రజనీకాంత్, స్టాలిన్, పళనిస్వామి కలిసి చాలా క్యాజువల్‌గా మాట్లాడుకుంటున్న మరో ఫోటో కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం తమిళనాడు నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ఈ వేడుకకు తరలివచ్చారు. భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan), కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ (V.D. Satheesan), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

